Game Đang Hot

విశాఖపట్నంలో 26న జరగనున్న ప్రత్యేకహోదా ఉద్యమాన్ని విచ్చిన్నం చేసేందుకు అధికార తెలుగుదేశం పార్టీ సర్వశక్తులూ ఒడ్డి పనిచేస్తోంది. చంద్రబాబు ఇప్పటికే ఈ ఉద్యమంలో పాల్గొని యువత ఫ్యూచర్ నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తెలుగుదేశం అనుకూల వెబ్ సైట్లు, టీడీపీ అనుచరులు కొందరు సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే విషప్రచారాలు సైతం మొదలు పెట్టారు. అయితే విశాఖ వేదికగా జరగనున్న ఈ ఉద్యమంలో కుట్ర చేసేందుకు కొందరు ఆకతాయిలు ఇప్పటికే స్కెచ్ గీసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీపై విషం చిమ్మేందుకు కొందరు ఆకతాయిలను వైఎస్సార్ కాంగ్రెస్ జెండాలు పట్టుకుని ఉద్యమంలోకి పంపేందుకు కుట్రలు పన్నినట్టు తెలుస్తోంది. వీరంతా ఉద్యమకారులతో కలిసి హింసాత్మక కార్యక్రమాలు చేయడం, అలా చేసేలా చుట్టూ ఉన్న శాంతియుత ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల్ని రెచ్చగొట్టడం, అదేవిధంగా దాడులు జరుగుతున్నాయంటూ భయాందోళనలకు గురిచేయడం, అదేవిధంగా పోలీసులపై దాడులు చేసి వారిని రెచ్చగొట్టడం.. ఇలా అవకాశం ఉన్న ప్రయత్నాలన్నీ చేసి ఉద్యమాన్ని డైవర్ట్ చేయాలనే వ్యూహంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు తెలియడంతో పార్టీ కార్యకర్తలను అప్రమత్తం చేసే పనిలో వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేపట్టారు.

Từ khóa : విశాఖ తిరాన మహా కుట్ర ?
Cùng Chuyên Mục

Thông Tin Lên đầu trang Top