Game Đang Hot
#ApSpecialStatus

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధనలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పోరాటం మనం అందరం చూస్తున్నాం. నాయకుడు ఒక్కడే పోరాటాలు చేస్తే చాలదు, నాయకుడికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నాయకులు తమవంతు తోడ్పాటు అందించాలి అని భావించి అందులో భాగంగా రాష్ట్ర యువతను మేల్కోలిపే దిశగా ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా కొంతమంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వినూత్నంగా పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, పార్టీ ముఖ్య నాయకులతో ఫేస్బుక్ లైవ్ కార్యక్రమాల ద్వారా నెటిజన్లను చైతన్యవంతం చేసే విధంగా ప్రతి వారం ఒక నాయకునితో ఈ ” ఆస్క్ అవర్ లీడర్ ” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ వారం రాప్తాడు నియెజకవర్గ సమన్వయకర్త శ్రీ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి #AskOurLeader ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు.
నెటిజన్లు ఈ కార్యక్రమంలో ప్రత్యేక హోదాపై తమకు ఉన్న సందేహాలను నివ్రుత్తి చేసుకోవచ్చు.లైవ్ ప్రోగ్రాం కోసం కింద పేజీ చూడగలరు



 ఇప్పటికే కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా గారు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య గారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకొచ్చి ప్రత్యేక హోదా ఆవశ్యకతను తెలియజేసి తమవంతు పోరాడుతున్నారు, ఇది మన బాధ్యత, మన భవిష్యత్తు.. మనమందరం పోరాడి సాదించుకోవాల్సిన మన భవిష్యత్తు 
ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు చూసి, దీనిద్వారా మీ ముందుకు వస్తున్న నాయకులతో మాట్లాడండి, ప్రత్యేక హోదా మీద మరింత అవగాహన తెచ్చుకొని దాన్ని సాధించే విధంగా పోరాడుదాం !! 
 ప్రత్యేక హోదా మా హక్కు రా మీరు పెట్టె బిక్ష కాదు !!
Từ khóa : ప్రత్యేక హోదాపై ఫేస్ బుక్ లైవ్ ప్రోగ్రామ్
Cùng Chuyên Mục

Thông Tin Lên đầu trang Top